Magazines

దేశం మొత్తం మాట్లాడుకునే సినిమా

1 గంట క్రితం

A movie the entire country is talking about.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం


వరుణ్ సందేశ్, గగన్ బాబు, సత్యం రాజేశ్, రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సోషల్ డ్రామా ‘కాస్ట్’. ఏకే జంపన్న రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు.

కశిక కపూర్, దివి వద్యా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది.

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘కోటేశ్వరరావు మాకు మంచి మిత్రులు. తన తొలి ప్రయత్నంగా ఒక మంచి సినిమా తీస్తున్నారు. ఈ టైటిల్ గురించి కోటేశ్వరరావుని అడిగాను. సమాజంలో కాస్ట్ పాత్ర ఏమిటి?, అంబేద్కర్ దాని గురించి ఎలా ఆలోచించారు?, ప్రస్తుత జనరేషన్ దాన్ని ఎలా చూస్తోంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మెసేజ్ ఓరియెంటెడ్‌గా, యాక్షన్ థ్రిల్లర్ అంశాలన్నీ కలిపి సినిమా చేశామని చెప్పారు. టీజర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డెఫినెట్‌గా సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుం టున్నాను. ఇప్పుడు భారతదేశమంతా తెలుగు సినిమా వైపు చూసే స్థాయికి తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

‘ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. కచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది. భారతదేశం మొత్తం ఈ సినిమా గురించి చెప్పుకుంటుంది. అనూప్ రూబెన్స్ అద్భుతమైన మ్యూజిక్ చేశారు. త్వరలోనే పాటలు విడుదలవుతాయి. డైరెక్టర్ సినిమాను బ్రహ్మాండంగా తీశారు. తను టాలీవుడ్‌లో ఒక బెస్ట్ డైరెక్టర్ అవుతారు’ అని ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు చెప్పారు.

డైరెక్టర్ ఏకే జంపన్న మాట్లాడుతూ, ‘కులమతాలకు అతీతంగా చూసేది ఒక్క థియేటర్ మాత్రమే. అక్కడ టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్తే ప్రతి ఒక్కరూ సమానంగా కూర్చోవచ్చు. అలాంటి థియేటర్‌ను, అలాంటి కల్చర్‌ను మనం ఎప్పుడూ కాపాడుకోవాలి’ అని అన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్