హీరో రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబోలో బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు నిర్మిస్తున్న సినిమా ‘తులాభారం’. ఈ సినిమా టైటిల్ రివీల్‌ను మేకర్స్ వినూత్నంగా రూపొందించిన ‘ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియోను విడుదల చేశారు. వివేక్ ఆత్రేయ తనదైన స్టయిల్ లో రూపొందించిన ఈ వీడియోను మై హోమ్ రామ్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమాలోని కీలక పాత్రలను కూడా పరిచయం చేశారు. జడేజాగా అనిల్ కరెళ్ల, రాబిన్‌గా రవి ఆంటోనీ, సౌండ్‌గా అనస్వర రాజన్, దేవరాజ్‌గా తరుణ్ భాస్కర్, శివాజీ రావుగా జేడీ చక్రవర్తి, కృష్ణవేణిగా ప్రియాంక మోహన్ కనిపించనున్నారు. ‘మాస్ మహారాజా’గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రవితేజ ‘మాస్ మహారాజా’కు బదులుగా ‘క్రైమ్ మహారాజా’గా పరిచయం అవుతున్నారు. చిత్ర బృందం ఆదివారం సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంతో సినిమా అధికారికంగా ప్రారంభమై, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌లోకి అడుగుపెట్టనుంది. ముహూర్తం సందర్భంగా దర్శకుడు వీవీ వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. చందు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, శ్రీ విష్ణు క్లాప్ కొట్టారు. శివ నిర్వాణ, బాబీ కలిసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌తో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు.
రవితేజ ‘తులాభారం’ మొదలైంది
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)