నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నుంచి నిర్మాత శరత్ మరార్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్ ‘ట్రయల్ అండ్ ఎర్రర్’.
ఈ సిరీస్ సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమల్ హాసన్ నటించిన స్టైలిష్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’కు దర్శకత్వం వహించిన రాజేష్ సెల్వ ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.
విభిన్నమైన పాత్రల్లో తనదైన నటనతో ఆకట్టుకునే సత్యదేవ్.. ఈ సిరీస్ లో ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కథకు మరింత ఇంటెన్స్సిటీ తీసుకురానున్నారు. ఫరియా అబ్దుల్లా కూడా ఈ ప్రాజెక్ట్‌లో మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
ఈ సిరీస్‌లో విరాజ్ అశ్విన్, చైతన్య కృష్ణ, వర్ష బొల్లమ్మ, యష్ పూరి, సంపత్ రాజ్, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో, రాజేష్ సెల్వ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్ ప్రతిభావంతులైన నటీనటుల కలయికతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది అని మేకర్స్ తెలిపారు.






కామెంట్‌లు (0)