Magazines

‘రంగులు రంగులే..’ సందడి షురూ..

1 గంట క్రితం

festivities begin
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నమిత్ మల్హోత్రా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదలైంది. శ్రీరాముడు, సీతమ్మ ప్రేమకథను అద్భుతమైన విజువల్స్‌తో ఆవిష్కరిస్తూ, వారి ప్రయాణంలోని మధురమైన క్షణాలను ఈ పాటలో చూపించారు. తెలుగులో రాఘవ్ కౌశిక్, వైశాలి సామంత్ తమ గాత్రాన్ని అందించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. రాకేందు మౌళి తెలుగులో సాహిత్యాన్ని అందించారు. నమిత్ మల్హోత్రా ‘రామాయణం’ ప్రపంచాన్ని మరో సంగీత అనుభూతితో పరిచయం చేస్తూ వచ్చిన ‘రంగులు రంగులే’ పాటలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి నటించారు.

హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి ఈ పాటను విడుదల చేశారు. ఏ.ఆర్. రెహమాన్ మాట్లాడుతూ,‘రామాయణం తరతరాలుగా ప్రజల హృదయాల్లో జీవిస్తున్న కథ. అలాంటి కథను సంగీతం ద్వారా ఆవిష్కరించడం నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభవం’ అని తెలిపారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులు అందుకున్న డీఎన్ఈజీ, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఎపిక్‌లో మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్