రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి 'డార్క్ చాక్లెట్' చిత్రాన్ని అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
హీరో విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ, ‘ప్రతి మనిషిలో ఒక డ్యూయాలిటీ ఉంటుంది. అది ఈ సినిమా చూసినప్పుడు మిర్రర్ రిఫ్లెక్షన్స్‌లా మీకు కనిపిస్తుంది. ఇది నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్‌లాంటి సినిమా. ఇలాంటి సినిమా ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఏ భాషలో వచ్చిన సినిమా తోనూ దీనిని కంపేర్ చేయలేరు.
ఇది ఒక తెలుగు సినిమా అని గర్వంగా చెప్తున్నాను. డైరెక్టర్ శశాంక్ ఈ సినిమాను చాలా విభిన్నంగా తీశాడు. ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి. ఇప్పటికే కొన్ని స్క్రీనింగ్స్ వేశాం. ఐదుసార్లు చూసిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఎందుకు ఇన్నిసార్లు చూస్తున్నారు అనేది మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఈ సినిమా తరతరాల పాటు గుర్తుండిపోయి, ఒక బెంచ్‌మార్క్‌లా నిలబడి పోతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
‘ఇలాంటి సినిమాను మీరు తెలుగులో ఎప్పుడూ చూడలేదనడంలో డౌట్ లేదు. కొంతమంది అయితే భారతదేశంలోనే ఇలాంటి ప్రయత్నాన్ని తాము చూడలేదని చెప్పారు’ అని దర్శకుడు శశాంక్ శ్రీవాస్తవ్ తెలిపారు.
ఇప్పటివరకు రాలేదు
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)