‘జనవరి 12 విడుదల’ హీరోలు వెంకటేష్, కల్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘జనవరి 12 విడుదల’. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే వెంకటేష్, కల్యాణ్ రామ్, కృతిశెట్టి ఫస్ట్ లుక్స్ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె పోషిస్తున్న లతారెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. కీర్తి సురేష్ కెరీర్లోనే అత్యంత ఆసక్తికరమైన, వినోదా త్మకమైన పాత్రల్లో లతారెడ్డి ఒకటిగా నిలవనుంది. ప్రస్తుతం ఊటీలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: జివి ప్రకాష్ కుమార్.







కామెంట్లు (0)