Magazines

మా నమ్మకం నిజమైంది..

2 గంటల క్రితం

jailer
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

అగ్ర కథానాయకుడు రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా 'జైలర్ 2' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఇటీవల థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య దేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ, ‘మేము నిర్మించిన సినిమా అయినా, పంపిణీ చేసిన సినిమా అయినా డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ రావడం అనేది అరుదైపోయింది. ఈ సినిమా విషయంలో మొదట అందరూ భారీ రేటు పెట్టి తీసుకున్నామని భయ పడ్డారు. కానీ ఇప్పటివరకు షోల వసూళ్లు చూసిన తర్వాత ఖచ్చితంగా కమిషన్ వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. రజనీకాంత్, నెల్సన్, అనిరుధ్నినమ్మి రిస్క్ చేశాము. దానికి ప్రతిఫలం దక్కుతుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విషయంలో మా నమ్మకం నిజమైంది’ అని అన్నారు. ‘ప్రతి ఒక్కరూ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విజయదశమి రోజుకే మేము బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాట పడతామనేది నా నమ్మకం. ఈ విజయాన్ని చేకూర్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని మైత్రి శశి చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్