తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియదర్శిని రామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మురళీధర్గా ఆయన పాత్ర పరిచయం చేశారు. ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, అన్నీ ఈయనే చెప్పేలా ఉన్నాడు. అసలు ఎవరు ఈ మురళీధర్? విమానంలో అతను ఏమి చేస్తున్నాడు? అంటూ మేకర్స్ రివీల్ చేసిన లుక్ ఆకట్టుకుంది. 2018లో విడుదలై కల్ట్ క్లాసిక్గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ వివేక్గా, అభినవ్ గోమఠం కౌశిక్గా, వెంకటేష్ కాకుమాను ఉప్పిగా, శ్రీనాథ్ మాగంటి కార్తీక్గా అలరించనున్నారు. తొలి పార్ట్ లో తమ స్నేహం, కామెడీతో యువ ప్రేక్షకులకు దగ్గరైన ఈ నలుగురి గ్యాంగ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకి సంగీతం: వివేక్ సాగర్, డీవోపీ: ఏజే ఆరోన్, ఎడిటర్: రవితేజ గిరిజాల, ఎగ్జిక్యూ టివ్ ప్రొడ్యూసర్: సౌమిత్రి ఎన్, లైన్ ప్రొడ్యూసర్: శ్రీను ఈర్ల.







కామెంట్లు (0)