Magazines

ప్రజా చైతన్యానికి యువ దర్శకులు కదలాలి

2 గంటల క్రితం

public awareness
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 2 నిమిషాల చదవడం

యువ ఫిలిం మేకర్లు తమ సృజనాత్మకతతో సమాజాన్ని ఆలోచింపజేసే లఘు చిత్రాలను రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

‎హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్‌–2026 కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విక్రమార్క జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,‘బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం. వివిధ రం గులు, సువాసనలతో కూడిన పూలు ఒకచోట చేరి నట్లుగా సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఏకతాటి పైకి తీసుకొచ్చే వేడుక బతుకమ్మ. అందుకే ఈ పండుగ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలు స్తుంది. యువ దర్శకుల్లోని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ నిర్వహించడం అభినందనీయం.

మూడు గంటల సినిమాలో చెప్పగలిగే కథను కేవలం రెండు, మూడు నిమిషాల నిడివి ఉన్న షార్ట్‌ఫిల్మ్‌లో చెప్పడం ఎంతో సృజనాత్మకతతో కూడు కున్న విషయం. యువ దర్శకులను ప్రోత్సహిం చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించ డానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ వేడుకలో షార్ట్‌ఫిల్మ్‌లు, పాటలు, జానపద గీతాలు, ఇన్‌ఫ్లుయె న్సర్లు, వ్యాసాలు తదితర విభాగాల్లో మొత్తం 29 అవార్డులతో యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సంతోషకరం. యువ దర్శకులు మంచి కథలతో ముందుకు వచ్చి, వినోదంతో పాటు సమాజానికి మేలు చేసే చిత్రాలను రూపొందించాలి. ‎తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రతిభావంతులకు తగిన అవకాశాలు లేవనే అభిప్రాయం గతంలో ఉండేది. అయితే ప్రస్తుతం తెలంగాణకు చెందిన పలువురు దర్శకులు, హీరోలు, నిర్మాతలు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు.

హైదరాబాద్‌ ప్రధాన కూడలిగా..

హైదరాబాద్‌ను భారతీయ సినిమా పరిశ్రమకు ప్రధాన గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ రంగ ప్రముఖులను హైదరాబాద్‌కు ఆహ్వానించడం, ఇక్కడ సినిమా రంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదు పాయాలు, అనుకూల వాతావరణాన్ని కల్పించడం ద్వారా నగరాన్ని భారతీయ సినిమా రంగంలో కీలక కేంద్రంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం.

సమస్యలపై అవగాహన కల్పించాలి

‎‎వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి సంక్షోభం, విద్యుత్‌ పొదుపు వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని యువ మేకర్స్‌ని కోరుతున్నాను. ప్రజా చైతన్యానికి యువ దర్శకులు కదలాలని ఆశిస్తున్నాను. బతుకమ్మ పండుగలో రంగురంగుల పూలు ఎలా విరబూస్తాయో, యువ ఫిలిం మేకర్ల జీవితాలు కూడా విజయాలతో అలా వికసించాలని ఆకాంక్ష‍ి స్తున్నాను.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్