Magazines

ఈ 'జంట' సర్‌ప్రైజ్‌ చేస్తుంది

18 నిమిషాల క్రితం

pair
avatar
balaji

ప్రచురించబడింది నవం 16, 2026 | 2 నిమిషాల చదవడం

కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'జంట'. ఈ చిత్రంలో పాడని కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వసుంధర ఆర్ట్స్ బ్యానర్ పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజశేఖర్ యాదవ్ రూపొందిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్‌ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ,'మా సినిమా కంటెంట్ కు తగినట్లు అమలాపురంలోని లొకేషన్స్ యాప్ట్ అవుతాయని అనిపించి ఇక్కడికి వచ్చాం. అమలాపురం నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్ గా మా సినిమా ఇక్కడ స్థానికంగా షూటింగ్ జరుపుకోవడం సంతోషంగా ఉంది.

ఈ స్క్రిప్ట్ ను మా డైరెక్టర్ రాజశేఖర్ తప్పితే మరొకరు డీల్ చేయలేరు. ఆయన వల్లే ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చింది. ఈ సినిమాతో ఒక యూనిక్, క్రియేటివ్ డైరెక్టర్ టాలీవుడ్ కు రాబోతున్నాడని చెప్పగలను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్లంతా గర్వంగా ఫీలవుతారు' అని అన్నారు. 'ఇది నాకు ఫస్ట్ తెలుగు మూవీ. ఈ సినిమాలో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది' అని హీరోయిన్ పాడని కుమార్ చెప్పారు. హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ,'బలమైన కథతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాలో మంచి ఎమోషనల్ డ్రైవ్, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలాంటి కథ ఇప్పటిదాకా రాలేదని చెప్పగలను. మా సినిమా క్యాప్షన్ 'యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో..'.

ఈ క్యాప్షన్ చూసి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. ఈ క్యాప్షన్ మా కథకు యాప్ట్ గా ఉంటుంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం' అని తెలిపారు. అరుణ్ పాండియన్, కల్పలత, నవీన్ నేని, అశోక్, శ్రావణ సంధ్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ - పెద్దిరాజు అడ్డాల, ఫైట్ మాస్టర్ - గౌరిశంకర్ వి.వి., డీవోపీ - రాహుల్ శ్రీవాస్తవ్, మ్యూజిక్ - సుభాష్ ఇషాన్, డైలాగ్ రైటర్ - నత్మిక, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కె.ఎస్. రవిబాబు, ప్రొడ్యూసర్స్ - రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్, స్క్రిప్ట్, డైరెక్షన్ - రాజశేఖర్ యాదవ్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్