యూఎస్ టారిఫ్‌ల ప్రభావం
న్యూఢిల్లీ : అమెరికా అధిక టారిఫ్‌ల దెబ్బకు భారత ప్రధాన ఎగుమతులు అన్నీ కుదేలవుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారతదేశ సౌర ప్యానెల్ ఎగుమతులు దాదాపు సగానికి పడిపోయాయి. ఆగస్టులో 134 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్యానెల్స్ ఎగుమతి జరగ్గా.. సెప్టెంబర్‌లో 80 మిలియన్ డాలర్లకు క్షీణించాయి. దీంతో దేశీయంగా ఈ పరిశ్రమ తయారీపైన ప్రతికూల ప్రభావం పడుతోంది. సౌర్య మాడ్యూళ్ల ఎగుమతులు ఏడాది కనిష్ట స్థాయిని చవి చూశాయి. గతంలో భారతదేశ మాడ్యూల్ ఎగుమతుల్లో అమెరికా వాటా 90 శాతంగా ఉంది. ఇటీవల ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌లు ఎగుమతులను దెబ్బతీస్తున్నాయి. యూఎస్ సుంకాలు ఈ రంగానికి కూడా ప్రమాదకరంగా మారాయని రేటింగ్ ఎజెన్సీ ఇక్రాకు చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీశ్ కుమార్ కదమ్ పేర్కొన్నారు. భారత సౌర మాడ్యూల్ తయారీ సామర్థ్యం సుమారు 110 గిగావాట్లుగా ఉంది. మార్చి 2027 నాటికి ఇది 165 గిగావాట్లకు దాటుతుందని ఇక్రా అంచనా వేసింది.
సగం తగ్గిన సోలార్ ప్యానెల్స్ ఎగుమతులు
- Advertisement -
- Advertisement -


