కత్తులు విసిరేవారికి కొదవ లేదు
కలువలు పంచేవాళ్లే తక్కువ
అరుదైనవాటి మీదనే చూపు నిలిపావనుకో,
అప్పుడు ఆనందం నీ సొంతం;
పట్టి పీడించాలనుకునేవాటిని
పట్టించుకోనప్పుడే బతుకు ప్రశాంతం
కృతఘ్నుల ప్రవర్తన బాధించినప్పుడూ అంతే –
కృతజ్ఞుల కృతజ్ఞతను గుర్తు చేసుకోవాలి
(Amendment అనే నా ఆంగ్లకవితకు స్వీయానువాదం)
ఎలనాగ






కామెంట్‌లు (0)