Magazines

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి..

12 నిమిషాల క్రితం

lung health
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, మన రోజూ వారి ఆహారంతో కొన్ని పదార్ధాలను ఎంపిక చేసుకోవాలి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం...

ఆకు కూరలు, కూరగాయలు : పాలకూర, కేల్, బెల్ పెప్పర్స్‌లో విటమిన్లు C, E, బీటా-కెరోటిన్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి శ్వాస కండరాలను రిలాక్స్ చేసి సహాయపడతాయి.

బెర్రీలు, ఆపిల్స్: బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆపిల్స్‌‌లో ఆంథోసయానిన్స్, క్వెర్సెటిన్ ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్షీణతను తగ్గించి, కాలుష్యం, పొగ నుండి ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షిస్తాయి.

ఫ్యాటీ ఫిష్ : సాల్మన్, మాకెరెల్, సార్డినెస్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను అందిస్తాయి. ఇవి COPD లాంటి పరిస్థితుల్లో శ్వాసకోశ వాపును తగ్గించడానికి సహాయపడతాయి.

బీట్స్, బీట్ గ్రీన్స్: బీట్స్‌లో సహజ నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయి.

పసుపు, అల్లం: కర్కుమిన్, అల్లం సమ్మేళనాలు శ్వాసకోశ వాపును తగ్గించి, కఫాన్ని (mucus) తొలగించడానికి సహాయపడతాయి.

గ్రీన్ టీ, కాఫీ: ఈజీసీజీ (EGCG), కెఫిన్ నిండిన ఈ పానీయాలు శ్వాసకోశ కార్యకలాపాలకు సహకరించి, ఫైబ్రోటిక్ మార్కర్లను తగ్గిస్తాయి.

నీరు, ద్రవస్వరూప ఆహారాలు: మంచిగా హైడ్రేషన్ పాటింపడం వల్ల శ్వాసకోశ కఫం పల్చగా ఉంటుంది, దీనివల్ల ఊపిరితిత్తులు ధూళి, పొగ వంటి వాటిని సులభంగా తొలగించగలుగుతాయి.

తగ్గించవలసిన/ మానుకోవాల్సిన ఆహారాలు

ప్రాసెస్డ్ & క్యూర్డ్ మీట్స్: బేకాన్, హాట్ డాగ్స్, కోల్డ్ కట్స్‌లో నైట్రేట్లు ఉంటాయి, ఇవి ఊపిరితిత్తుల వాపును పెంచగలవు.

అధిక ఉప్పు: ఎక్కువ సోడియం తీసుకోవడం వల్ల శరీరంలో నీరు చేరి, ఆయాసం ఎక్కువగా అవుతుంది.

వేయించిన & నూనె పదార్థాలు: ఎక్కువ కొవ్వు ఉన్న లేదా వేయించిన పదార్థాలు కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్‌ను కలిగిస్తాయి, దీనివల్ల డయాఫ్రమ్ పైన ఒత్తిడి పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

చక్కెర పానీయాలు, మద్యం : ఎక్కువ చక్కెర, మద్యం శరీరానికి, శ్వాసకోశాలకు వాపును పెంచుతాయి.


వాణీ అయోధ్య క్లినికల్‌ డైట్‌ కన్సల్టంట్‌ 99593 61180


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్