Magazines

అల్లుకున్న పోగులు

24 అక్టోబర్, 2026

Interwoven Strands
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం



కొన్ని పోగుల్ని పేని,

మనిషి తనను తాను నెమ్మదిగా అల్లుకుంటాడు.

పుట్టుకతో వచ్చినవి రక్తబంధాలైతే

జీవితంలో పెనవేసుకున్నవి మనసు బంధాలు

ఒక్కో పరిచయం

కాలచక్రంలో చిక్కిన సన్నని నూలుపోగులాంటిదే

కలిసిన క్షణాలు మాట్లాడిన ఘడియలు...

అన్నీ కనిపించని ముడులుగా మారి

హృదయానికి అల్లుకుని స్థిరపడతాయి

బలమని అనుకున్న పోగు

ఒకరోజు బలహీనత కావచ్చు

విడిపోయిన పీలికలు గుండె వస్త్రంలో చిరిగిన అంచులై

అప్పుడప్పుడూ గుర్తుకు వస్తుంటాయి

అయినా జీవితం

చిరిగిన చోటునే కొత్త అల్లికను మొదలుపెడుతుంది

పోగులు తెగిపోవడం ఓటమి కాదు

కొత్త నూలును వెతకమనే కాలపు సంకేతం

మనిషి నిజమైన సంపద

తాను అల్లుకున్న అనుబంధాల నాణ్యతే

ఎందుకంటే... జీవితం ఒక వస్త్రమైతే,

మనసు అల్లుకున్న పోగులే

మన నిజమైన అస్తిత్వం

చివరికి మనిషికి గుర్తింపు వచ్చేది

తాను తన కోసం నేసుకున్న వస్త్రం వల్ల కాదు

తనతో పాటు

మరొకరి జీవితాన్ని అల్లిన పోగుల వల్లే...!

డా. కటుకోఝ్వల రమేష్, 9949083327

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్