నీలమ్మ నీలిగగన మేగుతున్నవా
నీలమ్మ ఆద్యకళాక్షేత్రమైనవా
తిరుమలన్న తొవ్వ ముచ్చటైనవా
అరుణోదయ ఆత్మబంధువైనవా
నీలమ్మ నీకు నివాళులమ్మ
నీలమ్మ కళా వందనాలమ్మ ||నీలమ్మ||
కష్టాల్లో ఉన్నప్పుడు
కొండంత అండ నీవు
ఆకలిగొన్నప్పుడు
ఆదరించే అమ్మ నీవు
కన్నీళ్లు తుడిసి పంపే
విరబూసేన నవ్వు నీవు
నీలమ్మ నీకు నివాళులమ్మ
నీలమ్మ నీకు వందనాలమ్మ ||నీలమ్మ||
విప్లవాభినందనలతో
అమర్- విమలక్క






కామెంట్‌లు (0)