Magazines

పల్లె అంటే

24 అక్టోబర్, 2026

What a village is
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం


మట్టిని

అన్నంగా మార్చే

మహనీయుని దర్శించటం

మట్టిని ప్రేమగా

చేతుల్లోకి తీసుకుని

కళ్లకద్దుకోవటం

ఎక్కడో‌ కోల్పోయిన మనల్ని

తిరిగి పొందటం

మనిషిగా జీవించిన మధుర గడియల్ని

మరోసారి పోగేసుకోవటం

కన్నీళ్లని చెమట చుక్కల్ని

ఏకకాలంలో స్పర్శించటం

ఆప్యాయతలూ అనురాగాల వర్షంలో

తడిసి ముద్దవటం

పల్లె అంటే మనం‌ నడిచిన మట్టిమీద

మళ్లీ పచ్చగా మొలకెత్తటం

- చిత్తలూరి, 9133832246


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్