Thursday, June 25, 2026
E-PAPER
Homeఆటలుసౌరవ్ గంగూలీ భ‌ద్ర‌త త‌గ్గింపు

సౌరవ్ గంగూలీ భ‌ద్ర‌త త‌గ్గింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) భద్రతను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగ్గించింది. ఆయనకు ఇంతకుముందు ఇస్తున్న ‘జెడ్’ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకుని, ‘వై’ (Y) కేటగిరీకి కుదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ భద్రతా విభాగం తాజాగా ప్రకటించింది. గంగూలీ భద్రత గురించి పునఃసమీక్ష చేసిన అనంతరం రాష్ట్ర భద్రతా విభాగ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గంగూలీ భద్రత తగ్గింపు అనేది కేవలం ఒక ప్రత్యేక నిర్ణయం కాదని, రాష్ట్రవ్యాప్తంగా వీఐపీ భద్రతా నిబంధనల పునర్వ్యవస్థీకరణలో భాగమేనని రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. 2023లో మమతా బెనర్జీ సర్కార్ గంగూలీకి ఉన్న ‘వై’ కేటగిరీ భద్రత నుంచి ‘జెడ్’ కేటగిరీకి పెంచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -