సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ-తుంగతుర్తి
సంకినేని హనుమంతరావు సతీమణి సంకినేని చూడమ్మా ఆశయాలను కొనసాగిస్తామని, ఆమె భౌతికంగా దూరమైనా ఆమె ఆశయాలు సీపీఐ(ఎం) కొనసాగిస్తుందని, పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) నాయకుడు మాజీ ఉపసర్పంచి సంకినేని హనుమంతరావు సతీమణి అయిన సంకినేని చూడమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. సంకినేని హనుమంతరావు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ నాడు భూస్వామ్య వ్యవస్థలో కార్మికులు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూసి, వారి బాగోగులను గూర్చి ఆలోచించిన మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా తుంగతుర్తి ప్రజల మన్నలను పొందారని అన్నారు. సీపీఐ(ఎం)లో పనిచేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో తాను ఒక సందర్భంలో గ్రామ ఉపసర్పంచ్ గా అన్ని వర్గాల ప్రజల మేలు కోసం ఈ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు ఆయన చేస్తున్న మంచి పనులకు అతని భార్య అయిన చూడమ్మా ప్రోత్సాహనిస్తూ పేద ప్రజలకు చేదోడు వాదోడుగా చేతనైనంత సహాయం చేస్తూ ప్రజల మన్నలను ఆమె పొందిందని అన్నారు.
ఒక అగ్రకులంలో పుట్టినప్పటికీ పేద ప్రజల బాగుకోసం కృషి చేసే మనస్తత్వం గల మంచి మనిషి ఆమె మనకు దూరం అవడం బాధాకరమని ఆమె సేవలను కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం మీద నిలబడుతూ కమ్యూనిస్టు అభిమానిగా తాను కోరుకున్నట్లు ప్రజలందరూ సమానంగా ఉండాలని కులమత బేధాలు లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని, గ్రామంలోని ప్రజల ఔన్నత్యం కోసం నిరంతరం తాపత్రయపడే వ్యక్తి మనకు దూరం అవడం బాధాకరమని, ఆమె భౌతికంగా లేకపోయినా ఆమెలో ఉన్న మంచితనాన్ని ప్రజల పట్ల ఉన్న మమకారాన్ని ఆమె ఆశయాలను ముందుకు తీసుక పోవుటకు సీపీఐ(ఎం) కృషి చేస్తుందని ఆయన అన్నారు. తదనంతరం పార్టీ నాయకత్వం ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు, కందాల శంకర్ రెడ్డి, నాయకులు పల్లా సుదర్శన్, ఓరుగంటి అంతయ్య, ముత్తయ్య, ఎల్లయ్య, ఉప్పుల సోమయ్య, యాదగిరి, గుడిపాటి వెంకయ్య, చంద్రయ్య మాజీ జెడ్పిటిసి తాటి విజయమ్మ పాల్గొన్నారు.



