- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానమంత్రి మోడీతో నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఛైర్మన్ రబీ లమిచానేను కలిశారు. ప్రధాని మోదీ, లమిచానేల మధ్య జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
మా ‘పొరుగు దేశాల్లో నేపాల్ ఒక ప్రధాన భాగస్వామి. మన ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక, బహుముఖ సంబంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అక్కడి కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము.’ అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
- Advertisement -



