ప్రజా ఉద్యమంతోనే ప్రజలకు న్యాయం
బీజేపీ, కాంగ్రెస్ రెండూ కార్పొరేట్ సేవకులే
ముద్దు ముద్దు మాటలతో మోసం : బడ్జెట్‌పై సదస్సులో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్ తేనె పూసిన కత్తిలా ఉందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య విమర్శించారు. ముద్దు ముద్దు మాటలతో సామాన్యులను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులంకాదు.. ప్రజలకు సేవకులమంటూనే కార్పొ రేట్‌లకు సేవకులుగా మారుతున్నారని దుయ్యబట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాటలో నడుస్తున్నామని చెప్పినమాట అబద్ధ మనీ, ప్రధాని మోడీ పలికిన చిలుక పలుకలనే రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క వల్లె వేశారని విమర్శించారు. బీజేపీపై కాంగ్రెస్‌కు అంత నమ్మకమేంటనీ, మోడీపై అంత విశ్వాసమెం దుకు? అని ఆయన ప్రశ్నించారు. ఆ రెండు పార్టీల మధ్య కుర్చీల కొట్లాటే తప్ప, విధానాల్లో తేడాలేదని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెంట్రల్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు మహేందర్ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర బడ్టెట్‌పై నిర్వహించిన సదస్సులో వీరయ్య మాట్లాడారు.
సామాజిక న్యాయమంటూనే అణగారిన వర్గాలకు కేటాయిం పులను తగ్గించారనీ, విద్య, వైద్యానికి పెద్దగా మార్పులేదని వీరయ్య ఈ సందర్భంగా తెలిపారు. అసంఘటిత రంగ కార్మికు లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు, బీడీ, చేనేత కార్మకులకు ఇచ్చిన హామీల ప్రస్తావనలేదని తెలిపారు. ఉద్యోగులు ఎదురు చూస్తున్న పీఆర్సీ, 5 డీఏల ఊసెత్తలేదని గుర్తుచేశారు. అంబేద్కర్ బాటలో నడిస్తే, సామాన్యులకు ఆర్థిక న్యాయం చేసే అంశాలను ఎలా విస్మరించారని ఆయన ప్రశ్నించారు. రాని ఆదాయం వస్తు న్నట్టు చూపించి అధికంగా కేటాయింపులు చేసి ఖర్చు చేయలేదని బీఆర్‌ఎస్‌ను విమర్శించిన కాంగ్రెస్ కూడా అదేబాటలో నడుస్తు న్నదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఇప్పటివరకు పాలకులందరూ ఇదేవిధంగా చేశా రని తెలిపారు. ముందుగా అధికంగా కేటాయింపులు చేయడం, ఆ తర్వాత ఆదాయం రాలేదనీ కోతలు విధించడం పరిపాటిగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెడతామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఆ దిశగా ప్రయత్నించలేదని తప్పుపట్టారు. పరిష్కారంలేని సమస్య ఉండదనీ, సమాధానంలేని ప్రశ్నలుండవనీ, చిత్తశుద్ధి ఉంటే మార్గ ముంటుందని అభిప్రాయపడ్డారు. సర్కారు వద్ద డబ్బుల్లేవని సెల బ్రిటీలు, ప్రముఖులతో చెప్పించే ప్రయత్నం చేస్తోందని, అఖిల పక్షం, ప్రజా సంఘాల నుంచి సూచనలు స్వీకరించే అవకాశ మున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదన్నారు.
శత కోటీశ్వరుల వద్ద సంపద పోగై ఉందనీ, అయినా కేంద్రంలో మోడీ సర్కార్ కార్పొరేట్ పన్నును 10 శాతం తగ్గిం చిందని విమర్శించారు. వారసత్వ సంపద పన్ను గతంలో ఉండే దని దాన్ని తిరిగి అమల్లోకి తెస్తే నిధుల సేకరణ జరుగుతుందని చెప్పారు. ఇవేమీ చేయకుండా రాష్ట్రానికి రావాల్సిన రూ.19 వేల కోట్లను ఇవ్వకుండా కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటూ పీఎం మోడీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కనీస పోరాటం చేయడంలేదని తప్పుపట్టారు. కేంద్రంతో గత బీఆర్‌ఎస్ ఘర్షణ కారణంగా నిధులురాలేదన్న రేవంత్ సర్కార్.. కేంద్రాన్ని మెప్పించి నిధులు తెస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రక్షిత తాగునీరు, కాలుష్య రహిత గాలి, పౌష్టికాహారం వంటి అంశాలను బడ్జెట్‌లో విస్మరించారని ఎత్తిచూపారు. మౌలిక సదుపాయాల కల్పన, పోస్టుల భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్య బలోపేతం కాదన్నారు. పేదలు చదివే యూనివర్సిటీలను విస్మరించి పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న స్కిల్ యూనివర్సిటీపైనే శ్రద్ధ చూపిస్తున్నారని విమర్శించారు. రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబ డులకు సుముఖత రాబట్టామని చెబుతున్న సర్కార్ దానిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అంటున్న ప్రభుత్వం ఆ భూయజమానుల భవిష్యత్ ను ఏం చేస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సేక రించిన భూయజమానులకు ఎలాంటి న్యాయం చేశారని ప్రశ్నిం చారు. మూసీ అవతల, ఇవతల ఉన్న వారిని తరలించకుండానే సుందరీకరణ చేయొచ్చని వీరయ్య అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లుకు అనుగుణంగానే రైతుల కోసం ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన విమర్శించారు. దీంతో రానున్న కాలంలో ఉచిత విద్యుత్ సరఫరాకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ మాజీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొద టి ఏడాదిలో కేటాయించిన మున్సిపల్ బడ్జెట్ రూ.15 వేల కోట్లు అయితే ఖర్చు చేసింది మాత్రం రూ.7 వేల కోట్లు మాత్రమే అని తెలిపారు. బడ్జెట్ కేవలం అంకెల గారడీ అని విమర్శించారు. ఈ సదస్సులో పార్టీ నగర కార్యదర్శి వెంకటేశ్ పాల్గొన్నారు.
తేనెపూసిన కత్తిలా రాష్ట్ర బడ్జెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



