రేషన్‌షాపులు రెగ్యులర్‌గా తెరిచే ఉంచాలి మధ్యతరగతినీ దృష్టిలో ఉంచుకోవాలి :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
రేషన్‌షాపుల ద్వారా పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని చాలాకాలంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని వస్తువులు ఇవ్వాలనే ప్రభుత్వ ప్రాథమిక నిర్ణయంపై 'నవతెలంగాణ' ఆయన అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఆయన స్పందించారు. ''దేశంలో పౌష్టికాహారంలోపంతో ఉన్న వారిలో 40 శాతంమంది ప్రజలు తెలంగాణలోనే ఉన్నారు. ఎల్‌నినో కరువు వల్ల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేవు. ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నది. అది కూడా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇస్తున్నారు. దాన్ని 12 కిలోలకు పెంచాలి. బియ్యం సహా అన్నింటి ధరలు బహిరంగమార్కెట్లో భారీగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది తీవ్రమైన ఆర్థిక భారమే.
ప్రభుత్వం వారిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రేషన్‌షాపుల ద్వారా మొత్తం 14 రకాల నిత్యవసర వస్తువులను సబ్సిడీపై ప్రభుత్వం అందచేయాలి. కందిపప్పు 2 కిలోలు ఇవ్వాలి. దానితో పాటు పెసరపప్పు, మినపప్పు లేదా మరోరకం పప్పును కూడా ఇవ్వాలి. కారం, పసుపు, చింతపండు, గోధుమపిండి ప్యాకెట్ 5 కిలోలు, నూనె, కోడిగుడ్లు, పాలప్యాకెట్ లు, కూరగాయలు కూడా ఇవ్వాలి. వీటిలో కొన్ని వస్తువుల ఉచితంగా, మరికొన్ని సబ్సిడీతో ఇవ్వాలి. అలాగే ఇతర కల్తీలేని నిత్యవసర వస్తువులు కూడా రేషన్‌షాపుల ద్వారానే ఇవ్వాలి. ప్రజలు ఎప్పుడైనా వెళ్లి తీసుకొనేట్లు రేషన్‌షాపులు నిరంతరం ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్‌షాపుల ద్వారా ఓ జత బట్టలు కూడా ఇచ్చేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 9 రకాల వస్తువులు ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్ సహా అనేక పట్టణాల్లో వలసకార్మికుల పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి కూడా రేషన్‌షాపుల ద్వారా సబ్సిడీ వస్తువులు ఇవ్వాలి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన వారికి అండగా నిలవాలి''.







కామెంట్లు (0)