రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరండి
ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి :ఆహ్వాన కమిటీ చైర్మెన్ జూలకంటి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
ఎమ్బీ భవన్లో పోస్టరావిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నల్లగొండలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 15న జరిగే అఖిల భారత కిసాన్ సభ మహాప్రదర్శన, బహిరంగ సభకు రైతులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలనీ, 15 నుంచి 18 వరకు జరిగే 36వ మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన కమిటీ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎమ్బీ భవన్లో బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ...15న జరిగే బహిరంగ సభకు మాజీ ఎంపీ బృందా కరత్, ఏఐకేఎస్ అఖిల భారత అధ్యక్షులు అశోక్ దావలే, ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్, పలువురు రైతు సంఘాల నేతలు హాజర వుతారని తెలిపారు. బహిరంగ సభ సందర్భంగా నల్లగొండలో మహా ప్రదర్శన నిర్వహిస్తు న్నామనీ, అందులో రెడ్‌షర్టు వాలంటీర్ల కవాతు, సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. 15వ తేదీ సాయంత్రం నుంచి 18 వరకు ప్రతినిధుల సభ జరుగుతుందని చెప్పారు. 14న ఎరువులు, విత్తనా లు, వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి 200 స్టాళ్లతో ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నట్టు తెలిపారు. మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టరావిష్కరణలో ఏఐఏడబ్ల్యూ యూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రైతు సంఘం కోశాధికారి ఎం.శోభన్, ప్రజా సంఘాల ప్రతినిధులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, ఆర్.వెంకట్రాములు, జె.వెంకటేశ్, ఉడత రవీందర్, టి. స్కైలాబ్‌బాబు, పి.ఆశయ్య, ఆర్. శ్రీరాంనాయక్, లెల్లెల బాలకృష్ణ, కట్టనర్సింహ, కోట రమేశ్, ఎ.వెంకటేశ్, టి.నాగరాజు, విజయ్, వంగూరు రాములు పాల్గొన్నారు.






కామెంట్లు (0)