Magazines

జనాభా పెరుగుతుంటే ఓట్లు తగ్గుతాయా?

1 గంట క్రితం

Do votes decrease as the population increases?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

దేశంలో జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్ లోని సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి 120 కోట్ల జనాభా ఉందనీ, ప్రస్తుతం 140 కోట్లకు చేరిందని తెలిపారు. సర్ పేరుతో 13 కోట్ల ఓట్లను తొలగించారని అన్నారు. ఓటు హక్కు కోసం ఎంతో మంది త్యాగం చేస్తే, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఓట్లను తొలగిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ పాపాలు పరాకాష్టకు చేరాయని, దక్షిణ భారతదేశంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు. నవంబర్ 1న రాంలీలా మైదానంలో కాంగ్రెస్ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ ను మూసేసి, అమిత్ షా హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై పాదయాత్ర చేసేందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను తీస్తున్న ఇండియా ఫైల్స్ సినిమాలో బీజేపీ మనువాదాన్ని చూపించబోతున్నట్టు తెలిపారు. అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్న బీజేపీ ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావాలని ఆయన చంద్రబాబును కోరారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు చర్చలు జరుపుతోందనీ, అయినా సరే బీజేపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు విలువ లేదనీ, ఆయన రాజీనామా చేసినా ఉపయోగం లేదని అద్దంకి దయాకర్ విమర్శించారు. తుమ్మిడిహెట్టిపై ఏమైన సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే సీఎంకు, నీటిపారుదల శాఖ మంత్రి తెలపాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్