ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేటీఆర్ పని పాటా లేక చిట్‌చాట్ పేరుతో చెత్త మాటలు మాట్లాడుతున్నారనీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిరోజూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో మీడియాలోనైనా ఉండటానికి కేటీఆర్ ఆరాటప డుతున్నాడన్నాడు. పేదల ఉసురు పోసుకున్నదెవరో, వారికి ఊపిరి లూదుతున్నదేవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 4.63 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త పింఛన్లు ఇవ్వకుండా పేదల ఉసురు తీశారని గుర్తు చేశారు. రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. రైతు భరోసా, క్వింటాల్‌కు రూ. ఐదొందల బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. నియాగాంధీ పేరు ఎత్తే నైతిక అర్హత కేటీఆర్‌కు లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తానని సోనియాగాంధీని మోసం చేసింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. సోనియమ్మ ఆత్మకథలో నమ్మక ద్రోహులకు స్థానం లేదని చెప్పారు.







కామెంట్‌లు (0)