ఆ నిధులను దారి మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
నిధుల మళ్లింపు ఆపకపోతే..సీఎం ఇల్లు ముట్టడి
రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికుల ‘సెస్’ నిధులను ప్రభుత్వం దారిమళ్లిస్తున్నదనీ, కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాల్సిన నిధులు సంబంధిత ప్రభుత్వ పెద్దలకు ముడుపుల రూపంలో పోతున్నాయని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బీఆర్‌టీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరా బాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక సంక్షేమ బోర్డు నిధుల పై కన్ను పడిందన్నారు. స్సీమ్ ల పేరుతొ స్కాములు చేస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే బీమా కార్యకలాపాలను ఒక ప్రయివేట్ సంస్థ ట్రయల్ బ్లేజర్ ఆర్గనైజేషన్ కి ఇచ్చి నెరుగా రూ.150 కోట్లు అవినీతి చేశారని చెప్పారు. కార్మికులకి ఎలాంటి సంబంధం లేని ఏటీసీ కేంద్రాల కు రూ. 600 కోట్లు కార్మికుల సొమ్ము ధారాధత్తం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంలోకి ఈ నిధులను దారి మళ్లించేందుకు కుట్ర జరుగుతున్నదని చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంలో కలిపితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. నారాయణ మాట్లాడుతూ కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..బోర్డు ని బలోపేతం చెయ్యాలని సూచించారు. కానీ నిర్వీర్యం చేస్తే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలతో తిప్పి కొడుతాయని హెచ్చరించారు.
అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ సంక్షేమ మండలి 1996 లో కార్మికుల కోసం మహో న్నతమైన లక్ష్యాలతో ఎర్పడిందని వివరించారు. రాజకీయ నాయకులకు ఈ కార్మికుల డబ్బులు పై కన్ను పడిందని చెప్పారు. కాంగ్రెస్ లూటీ చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో టీయూసీఐ అధ్యక్షులు సూర్యం మాట్లాడుతూ కార్మి కుల సొమ్ము కాంట్రాక్టర్ల పాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలని సూచించారు. కార్యక్రమములో సీఐ టీయూ రాష్ట్ర నాయకుడు రాజు, ఐఎఫ్‌టీయూ అధ్య క్షురాలు అనురాధ, బీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వేముల మారయ్య, ప్రభాకర్, బీఓసీ ప్రధాన కార్యదర్శి పాలదుగుల రమేష్, ఏఐటీయూసీ నాయ కులు, యాదగిరి, బీఎన్‌ఆర్‌కేఎస్ అధ్యక్షుడు కమర్ల ఐలయ్య, స్పూర్తి యూనియన్ అధ్యక్షులు కుమార్, ఎలక్ట్రీషియన్ యూనియన్ అధ్యక్షులు కొండలరెడ్డి, వడ్డేర కార్మిక సంఘం అధ్యక్షులు పల్లపు సత్యనారణ, భవన నిర్మాణ అధ్యక్షులు గంధం అంజయ్య తదితరులు మాట్లాడారు.







కామెంట్‌లు (0)