Magazines

ఓయూలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు

4 రోజుల క్రితం

Non-teaching staff
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

విద్యార్థి, పరిశోధక విద్యార్థి సంఘాల మద్దతు

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ

​హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ‌మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. దీక్షల్లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఉపేందర్‌, ఎన్జీవోస్‌ తరఫున మల్లేష్‌, టెక్నికల్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ నుంచి మల్లేష్‌, బిక్షపతి, మహేష్‌, బీఈడీ కాలేజీ నుంచి మహేశ్వరి, అడ్మిన్‌ బిల్డింగ్‌ నుంచి మెహర్‌, వినోద్‌, షేక్‌ ఫారూక్‌, ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ నుంచి యరాల రాజేష్‌, పి. సురేష్‌, కె. శ్రీకాంత్‌, గెస్ట్‌హౌస్‌ నుంచి శ్రీనివాస్‌ యాదవ్‌, టైమ్‌ స్కేల్‌ ఉద్యోగుల తరఫున శ్రీనివాస్‌ తదితరులు కూర్చున్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ రిజిస్టర్‌ ‌మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే రిలే నిరాహార దీక్షలు చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పోరాటానికి విద్యార్థి సంఘాలు, పరిశోధక విద్యార్థుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిరుద్యోగ జేఏసీ నేత డాక్టర్‌ ఆర్‌.ఎల్‌. మూర్తి (ఎస్‌ఎఫ్‌ఐ), మహేందర్‌ (సీఐటీయూ), ప్రదీప్‌ (టీయూసీఐ), కిరణ్‌, సాయి ప్రసాద్‌, ఉదయ్‌కుమార్‌ (పీడీఎస్‌యూ) తదితరులు దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలుపుతూ, సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగ జేఏసీ చేస్తున్న న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. సమస్యలను పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీక్షలో కూర్చున్న వారికి సాయంత్రం ఓయూ ఇన్‌చార్జి ఫైనాన్స్‌ ఆఫీసర్‌ ప్రతాప్‌ సింగ్‌ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్