2027 జనవరి నుంచి రెండోదశ జనాభా లెక్కింపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో రెండో దశ జనాభా(జన గణన- 2027) కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేర కు రాష్ర్టప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం జీవో నెంబర్ 155 జారీ చేశారు. జనవరి 10 నుంచి 24 వరకు యాప్ , వెబ్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమ రేషన్‌కు అవకా శం కల్పించారు. ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జన గణకులు ఇంటింటికీ వెళ్లి జనాభా లెక్కిస్తారు. మార్చి 1 నుండి 5 వరకు సవరణలకు అవకాశం కల్పించారు. రాష్ర్టంలో మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడతలో ఇండ్ల గణన పూర్తయింది. రెండో విడత కోసం ఇప్పటికే సన్నాహాక సమావేశాలతో పాటు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.






కామెంట్‌లు (0)