Magazines

ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి

13 నిమిషాల క్రితం

One should seize employment opportunities.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

తెలుగు విభాగ డైరెక్టర్ 
డాక్టర్‌ కె. గీతా మాధవి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సాహిత్యాలను అధ్యయనం చేసే విద్యార్థులకు, పరిశోధకులకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపాధి అవకాశాలున్నాయని, యువతరం వాటిని అందిపుచ్చుకోవాలని ప్రముఖ తెలుగు భాష నిపుణులు, లింక్డ్ ఇన్  తెలుగు విభాగ డైరెక్టర్ డాక్టర్‌ కె. గీతా మాధవి (కాలిఫోర్నియా ) అన్నారు. ఆర్ట్స్ కళాశాలలో , తెలుగుశాఖ ఏర్పాటు చేసిన "సాంకేతిక రంగంలో  తెలుగుభాష - వినియోగం, ఉపాధి అవకాశాలు" అనే అంశంపై మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో భాషలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని, ప్రస్తుత అవసరాల దృష్ట్యా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని  సూచించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్‌ సి. కాశీం మాట్లాడుతూ నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే నిరక్షరాస్యులుగా పరిగణింపబడుతున్నారని, కనుక విద్యార్థులు శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల అవగాహనను పెంపొందించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలుగుశాఖ అధ్యక్షులు డాక్టర్‌ ఏలె విజయలక్ష్మి మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాలు విస్తృతం కావాలంటే కంప్యూటీకరణ జరగాలన్నారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన తెలుగుశాఖ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఎస్ రఘు మాట్లాడుతూ తెలుగు విద్యార్థులు సంప్రదాయ బోధనా రంగంలోని ఉద్యోగాలనే కాకుండా, సాంకేతిక రంగంలోని ఉపాధి అవకాశాలను కూడా పొందాలని ఆకాంక్షించారు. ఆచార్య సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విద్యను తప్పనిసరిగా నేర్చుకోవాలని, భవిష్యత్తులో భాష కళలు, సాహిత్యం వంటి రంగాలలో కూడా సాంకేతికత విస్తృతంగా ప్రవేశించబోతుందని ‌చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్‌ ఇమ్మిడి మహేందర్,  డాక్టర్‌ ఎస్. చంద్రయ్య, డాక్టర్‌ ఇడికోజు శ్రీనివాస చారి,  తెలుగు పరిశోధకులు, ఎం. ఏ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, నిజాం కళాశాల ఎం. ఏ విద్యార్థులు, కళాశాలలోని ఇతర విభాగాల విద్యార్థులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్