నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్-2027వచ్చేసింది.వచ్చే ఏడాది ఫిబ్రవరి24 నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 24నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి25నుంచి ద్వితీయ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొంది.ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు; ఫస్ట్ ఇయర్ సైన్స్ సబ్జెక్టులకు(కొత్త ప్యాటర్న్ ప్రకారం)ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు మూడు సెషన్లలో జరగనున్నాయి.ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు ఫస్టియర్ విద్యార్థులకు జనవరి29న,ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు జనవరి 30న నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్-2027
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)