Magazines

సామాజిక బాధ్యతను చాటిన శ్రీచైతన్య విద్యాసంస్థలు

18 నిమిషాల క్రితం

Sri Chaitanya Educational Institutions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

చైర్ పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి 
జన్మదినాన బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌

2,968 మంది స్వచ్ఛందంగా రక్తదానం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సమాజ శ్రేయస్సులోనూ మేము సైతం అంటూ శ్రీచైతన్య విద్యాసంస్థలు మరోసారి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్ పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా శుక్రవారం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులో శ్రీచైతన్య విద్యాసంస్థలు, ఎన్టీఆర్ ట్రస్ట్, న్యూసిటీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తాధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య టెక్నో స్కూల్స్, కళాశాలలకు చెందిన 2,968 మందికి పైగా సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సామాజిక సేవ పట్ల తమకున్న నిబద్ధతను చాటుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రక్తదానం చేసిన వారిలో విశాఖపట్నం నుంచి 353 మంది, కాకినాడ - 75, రాజమండ్రి - 50, విజయవాడ - 323, గుంటూరు - 72, నెల్లూరు - 98, తిరుపతి - 61, కడప - 57, కర్నూలు - 46, అనంతపూర్ - 52, హైదరాబాద్ - 570 మరియు బెంగళూరు - 661, చెన్నై నుంచి 550 మంది శ్రీచైతన్య సిబ్బంది ఉన్నారు.

విద్యారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలను సాధిస్తూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు విద్యతో పాటు సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ తమ సహాయ కార్యక్రమాలను చేపట్టి సమాజం పట్ల తమ బాధ్యతను చాటుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్ పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి మాట్లాడుతూ, "41 ఏండ్ల క్రితం డాక్టర్ బి.ఎస్.రావు నాటిన చిన్న విద్యా విత్తనం నేడు మహావృక్షంగా ఎదిగి, ప్రపంచం గర్వించే మేధావులను అందిస్తోందని" చెప్పారు. ఈ ప్రస్థానం వెనుక ఆయన అంకితభావం దూరదృష్టితో పాటు బోధన, బోధనేతర సిబ్బంది కృషి వెల కట్టలేనిదని కొనియాడారు. డాక్టర్ బి.ఎస్. రావు ఆశయాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. తమ కుమార్తెలు అకడమిక్ డైరెక్టర్లు సుష్మ, సీమలను అభినందించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన మాట్లాడుతూ, "శ్రీచైతన్య విద్యాసంస్థలు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక మా తల్లిదండ్రుల త్యాగం, కృషి ఎంతో ఉన్నాయి. ఆమె జన్మదిన శుభసందర్భంగా నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని తమ సామాజిక బాధ్యతను చాటుకోవడం ఎంతో అభినందనీయం" అని అన్నారు. శ్రీచైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమా బొప్పన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేకూరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య విద్యాసంస్థ డైరెక్టర్లు సీమ బొప్పన, నాగేంద్ర కుమార్ పాల్గొని రక్తదానం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్