Magazines

ఆ మేజిస్ట్రేట్‌‌ను బదిలీ చేయాల్సిందే!

9 నిమిషాల క్రితం

That magistrate must be transferred!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 2 నిమిషాల చదవడం

మేజిస్ట్రేట్ పనితీరుపై న్యాయవాదుల అసంతృప్తి

నేటి నుంచి కోర్టు విధుల బహిష్కరణకు తీర్మానం

చీఫ్ జస్టిస్ వద్దకు ప్రతినిధి బృందం

నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

​ఖమ్మం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్‌లో బుధవారం న్యాయవాదులు సమావేశమై, జిల్లా కోర్టు ప్రాంగణంలో పనిచేస్తున్న ఓ మేజిస్ట్రేట్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సదరు మేజిస్ట్రేట్‌కు బదిలీ అయినప్పటికీ వెళ్లిపోకుండా.. మళ్లీ ఇక్కడే కొనసాగేలా బదిలీ నిలుపుదల చేయించుకోవడం పట్ల బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయవాదులను చిన్నచూపు చూస్తూ ఇబ్బంది పెడుతున్న సదరు మేజిస్ట్రేట్‌పై చర్యలు తీసుకునేంత వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టాలని న్యాయవాదులు నిర్ణయించారు. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బార్‌ అసోసియేషన్‌ ‌జనరల్‌ ‌బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేజిస్ట్రేట్‌పై చర్యలు తీసుకునేంతవరకు సదరు కోర్టు విధులను గురువారం నుంచి బహిష్కరించాలని తీర్మానాన్ని ఆమోదించారు. బార్ నిర్ణయాన్ని ఉల్లంఘించిన న్యాయవాదులపై బార్ బైలా ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, మేజిస్ట్రేట్‌పై విజిలెన్స్ దర్యాప్తు జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరాలని తీర్మానించారు. త్వరలోనే సీనియర్ న్యాయవాదులతో కూడిన ఒక ప్రతినిధి బృందం హైదరాబాద్ వెళ్లి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి సదరు న్యాయమూర్తిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సీనియర్‌ ‌న్యాయవాది ఎండీ జహీర్‌ అలీ చేసిన అభ్యర్థన మేరకు బార్‌ అసోసియేషన్‌ ‌మేజిస్ట్రేట్‌ ‌పని తీరును చర్చించి తీర్మానం చేశారు. ​ కొందరు గతంలో బార్ తీర్మానాలకు విరుద్ధంగా వ్యవహరించిన సందర్భాలను ప్రస్తావిస్తూ, అలాంటి ధోరణుల వల్ల బార్ ఐక్యత దెబ్బతినకూడదని చెప్పారు. కోర్టు బహిష్కరణ లేదా బదిలీ వంటి అంశాలపై నిర్ణయం తీసుకునేటప్పుడు నిబంధనలు, న్యాయపరమైన అంశాలు, ఆచరణాత్మక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు యడ్లపల్లి రమేష్, ఇతర ప్రతినిధులతో పాటు వందలాది మంది సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్