Magazines

‌విద్యుద్ఘాతంతో ఇద్దరు మృతి

8 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

​నవతెలంగాణ-కొండపాక

విద్యుద్ఘాతంతో ఇద్దరు మృతి చెందిన సంఘటనలు సిద్దిపేట ‌జిల్లా కొండపాక మండల పరిధిలో మంగళవారం జరిగాయి. సిద్దిపేట త్రీ టౌన్ సీఐ లక్ష్మీబాయి ​తెలిపిన వివరాల ప్రకారం.. కొండపాక మండలం చిన్నకోడూరు గ్రామానికి చెందిన చెరుకు నాగరాజు (25) తొలిసారిగా అయ్యప్ప స్వామి మాల ధరించారు. అతని అన్న చెరుకు కనకరాజు కొన్నేండ్లుగా ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష చేపడుతూ దుద్దెడ గ్రామంలో నివాసం ఉంటూ సన్నిధానం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాగరాజు కూడా అన్న ఇంటికి వచ్చి అయ్యప్ప దీక్షను కొనసాగిస్తున్నారు. మంగళవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి ముందు టెంటు వేస్తుండగా ఇనుప పైపులు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో నాగరాజు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మరో ఘటనలో బంగారం గ్రామానికి చెందిన రాగుల దుర్గయ్య ప్రమాదవశాత్తు విద్యుత్‌ ‌ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్