Magazines

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించాలి

13 గంటల క్రితం

We must secure a fair share of the Krishna waters.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం

సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించాలి

డిండి, అచ్చంపేట పనులు వేగవంతం చేయాలి : అధికారులకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కృష్ణా జలాల్లో రాష్ర్టానికి రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టు లో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీతో వివాదం ఉన్న అన్ని అంశాలపై అవసరమైన ఆధారాలను సమర్పించాల ని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌‌రెడ్డితో కలిసి నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18 తర్వాత సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం రెండు పథకాలకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లపూర్ నుంచి ఏదుల వరకు తరలించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. టన్నెల్, కాలువలు ఎక్కడెక్కడ అవసరమో గుర్తించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి, అందుకనుగుణంగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం అధికారులను హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా అప్రమత్తంగా వ్యవహ రించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటినే తరలించలేని పరిస్థితి ఉన్నందున అదనపు టీఎంసీ పనుల విషయంలో బాధ్యతాయు తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర జల సంఘం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందడంతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్. వైద్యనాథన్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్