Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

- Advertisement -

మండల ప్రత్యెక అధికారి జినుగు మరియాన్న
నవతెలంగాణ – నెల్లికుదురు

ప్రతి విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో పాటు మనోవికాసం సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మండల ప్రత్యేక అధికారి జీనుగు మరియాన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సీ గృహాన్ని సందర్శించి విద్యా వసతి భోజన సదుపాయాలను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. అలాగే మానసిక ఆరోగ్య, క్రీడలు, వ్యాయామం లాంటి తదితర అంశాలు పై కూడా విద్యార్థులకు నిత్యం అవగాహన చేయాలని తెలిపారు.

వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతను విద్యార్ధులతో పాటు, సిబ్బంది మొత్తం పాటించాలని, తాజా వేడి వేడి ఆహారం అందించాలని, సకల చర్యలు తీసుకోవాలని, విద్యార్ధుల అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనపడితే వెంటనే ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని, స్వీయచికిత్స చేయరాదని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వసతి గృహాల సంక్షేమ అధికారి ఎల్. సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -