Friday, March 13, 2026
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయ కళాశాలను సందర్శించిన విద్యార్థులు

వ్యవసాయ కళాశాలను సందర్శించిన విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
ఖమ్మం జిల్లా వైరా టీ.జీ.ఆర్‌.ఎస్, జూనియర్ కాలేజ్ (గర్ల్స్) కు చెందిన 9వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులు 65 మంది, 6 (ఆరుగురు) అధ్యాపకులతో కలిసి అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను శుక్రవారం విద్యా పర్యటనగా సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ, వ్యవసాయ మరియు ఉద్యాన పంటల సాగులో ఆధునిక పద్ధతులను సమయానుకూలంగా అనుసరించడం ద్వారా రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రైతులకు నిరంతరం సాంకేతిక సేవలు అందించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని, దీనికోసం నేటి యువత అంకితభావంతో ముందుకు రావాలని సూచించారు.

ఈ విద్యా పర్యటనలో విద్యార్థినులు వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన పొందారు. ముఖ్యంగా వివిధ వ్యవసాయ మరియు ఉద్యాన పంటలు, వ్యవసాయ వాతావరణ శాస్త్రం (మెటిరియాలజీ), వానపాముల ఎరువు తయారీ (వర్మీ కంపోస్టింగ్) వంటి అంశాలను ప్రాక్టికల్‌ గా పరిశీలించారు.

అదేవిధంగా కొబ్బరి తోటల్లో కోకో, పసుపు, టపియోకా, చామదుంప వంటి అంతర పంటల సాగు, ఆరెకా నట్స్ సాగు విధానం, దేశీయ మరియు విదేశీ మామిడి రకాలు, అధిక సాంద్రత మామిడి సాగు, ఆయిల్ పామ్ సాగు, అధిక లాభాలు అందిస్తున్న అర్కాసావి రోజ్ పూల సాగు వంటి అంశాలపై వివరమైన అవగాహన కల్పించారు. అలాగే క్యూ ఆర్ కోడ్ ద్వారా పంటల సమాచారం, మల్చింగ్, బిందు సేద్యం వంటి ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులను కూడా విద్యార్థినులకు వివరించారు.

ఈ పర్యటనలో జి. సంధ్య (పీజీ టీ ఇంగ్లీష్), టి. రేణుక (నర్సింగ్ ఆఫీసర్), ఎన్‌.ఎస్‌.ఎస్‌.కె. హరిని (మ్యూజిక్ టీచర్), డి. కొండల్ రావు (టీజీటీ ఇంగ్లీష్), ఎం. ఝాన్సి (జూనియర్ లెక్చరర్ – జువాలజీ), ఎం. సమైక్య (అగ్రికల్చర్ వొకేషనల్ ట్రైనర్) పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డా. నీలిమ మరియు డా. స్రవంతి సమన్వయం చేసి విద్యార్థినులకు సమగ్రంగా మార్గదర్శనం చేశారు.

సందర్శన అనంతరం విద్యార్థినులు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా వ్యవసాయం ఆధారంగా స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టించుకోవచ్చని తెలుసుకున్నామని తెలిపారు. ఈ విద్యా పర్యటన తమకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -