Magazines

కలుషిత ఆహారం తిని 13 మంది విద్యార్థులకు అస్వస్థత

2 గంటల క్రితం

13 students fall ill after eating contaminated food
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రతీబాద్‌ ప్రాంతంలోని శ్రమోదయ విద్యాలయ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బంగాళాదుంప కూర తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కూరలో బల్లి ఉందని, క్యాంటీన్‌ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రిన్సిపాల్‌ క్యాంటీన్‌ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్