Magazines

సుప్రీంకోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టులు

1 గంట క్రితం

Arrests continue despite Supreme Court orders.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : శాంతియుతంగా నిరసనలు చేపట్టేవారిని ఇబ్బంది పెట్టవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితుల్లోనే అరెస్టులు చేయాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే, కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఢిల్లీలో ఆందోళనకారుల అరెస్టులు కొనసాగాయి. కన్నాట్‌ ప్లేస్‌, రాజీవ్‌ చౌక్‌ నుంచి జంతర్‌మంతర్‌కు ర్యాలీగా వెళ్తున్న సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నేతలను కూడా అడ్డుకుని అరెస్టు చేశారు. తమ జాతీయ అధ్యక్షుడు ఆదర్ష్‌ ఎం. సాజి సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్‌ఎఫ్‌ఐ వెల్లడించింది. ఆదర్ష్‌కు గాయాలైన వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా అరెస్టులు కొనసాగడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్