నవతెలంగాణ - హైదరాబాద్ : కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దసరా నవరాత్రుల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. దుర్గా దేవి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న భక్తులపైకి ఆదివారం తెల్లవారుజామున లారీ దూసుకెళ్లింది. హుక్కేరి తాలూకాలోని హత్తరగి టోల్ ప్లాజా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు ప్రకాష్, మహేష్, దనేశ్వరి మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దుర్గా ఊరేగింపులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)