Magazines

హర్మూజ్‌ జలసంధిలో నౌకలపై దాడులు

3 గంటల క్రితం

Attacks on ships in the Strait of Hormuz
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హర్మూజ్‌ జలసంధిలో సింగపూర్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన రెండు కంటైనర్‌ నౌకలపై గుర్తుతెలియని ప్రక్షేపకాలతో దాడులు జరిగాయి. ఈ ఘటనలో ‘జీఎఫ్ఎస్‌ ప్రైడ్‌’ నౌక మంటల్లో చిక్కుకుని సముద్రంలో మునిగిపోయింది. అందులోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు సింగపూర్‌ మారిటైమ్‌ అండ్‌ పోర్ట్‌ అథారిటీ తెలిపింది. మరో నౌక ‘జీఎఫ్ఎస్‌ గిసెల్‌’ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, అందులోని 22 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. కాగా, తమ జలాల్లోకి అనధికారికంగా ప్రవేశించిన నౌక నేవల్‌ మైన్‌ను ఢీకొని పేలిపోయిందని ఇరాన్‌ పేర్కొంది. సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్లతో ఇతర నౌకలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. హర్మూజ్‌ జలసంధిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఐఆర్జీసీ నేవీ కమాండర్‌ అలీ అజ్మాయీ స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్