నవతెలంగాణ - హైదరాబాద్ : నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలోని దేవినగర్లో విషాదం చోటుచేసుకుంది. లక్ష్మణ్, గాయత్రి దంపతుల తొమ్మిది నెలల కుమారుడు ఆర్యవర్ధన్ ఆడుకుంటుండగా వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం చిన్నారి మృతి చెందాడు.







కామెంట్లు (0)