నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలు, ఇంటర్ కాలేజీలకు ఈ నెల 10 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. సెలవుల షెడ్యూల్‌ను అన్ని విద్యాసంస్థలు కచ్చితంగా పాటించాలని అధికారులు ఆదేశించారు. సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించొద్దని స్పష్టం చేశారు. ఇంటర్ కాలేజీలు ఈ నెల 22న, పాఠశాలలు 23న తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ప్రకటించారు.
దసరా సెలవులు.. స్కూళ్లకు కీలక ఆదేశాలు
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)