నవతెలంగాణ - హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినీ నటి సురేఖావాణిని కించపరిచేలా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై టీపీసీసీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది కైలాశ్ సజ్జన్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘డిగ్‌టీవీ తెలుగు (డిగ్‌టీవీ ప్యారడీ)’ పేరుతో ఉన్న ఓ ఎక్స్ ఖాతాలో సీఎం రేవంత్‌రెడ్డి, నటి సురేఖావాణి చిత్రాలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టు ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని ఆరోపించారు. అలాగే మహిళా నటి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టు చేశారని తెలిపారు. ఈ పోస్టుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కైలాశ్ సజ్జన్ పోలీసులను కోరారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు సంబంధిత ఎక్స్ ఖాతా






కామెంట్‌లు (0)