నవతెలంగాణ - హైదరాబాద్ : ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ తన 21 ఏండ్ల అంతర్జాతీయ కెరీర్‌కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎస్టాడియో మాన్యుమెంటల్‌లో బెనిన్‌తో మంగళవారం జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ అర్జెంటీనా జెర్సీలో అతడికి చివరి మ్యాచ్‌గా నిలిచింది. సుమారు 85 వేల మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. వీడ్కోలు మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్ చేయడంతో పాటు మరో రెండు గోల్స్‌కు అసిస్ట్‌లు అందించాడు. 71వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచి అంతర్జాతీయ కెరీర్‌లో తన 126వ గోల్ నమోదు చేశాడు. అర్జెంటీనా తరఫున ఇది అతడికి రికార్డు స్థాయిలో 208వ మ్యాచ్.
మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు మెస్సీ భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం ‘‘నా జీవితాంతం అర్జెంటీనా కోసం ఆడాలని ఉంది’’ అంటూ దేశంపై తన ప్రేమను చాటుకున్నాడు. మెస్సీ వీడ్కోలు సందర్భంగా స్టేడియంలో భారీగా వేడుకలు నిర్వహించారు. 2022 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులు సైతం హాజరై తమ కెప్టెన్‌కు వీడ్కోలు పలికారు. 39 ఏళ్ల మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా 2022 ప్రపంచకప్‌తో పాటు రెండు కోపా అమెరికా టైటిళ్లు సాధించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. క్లబ్ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్నాడు. అమెరికాకు చెందిన ఇంటర్ మయామితో అతడికి 2028 వరకు ఒప్పందం ఉంది.





కామెంట్‌లు (0)