నవతెలంగాణ - హైదరాబాద్ : సైబర్ మోసగాళ్లపై తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆరు రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో 18 మంది మహిళలు, 83 మంది పురుషులు కలిపి 101 మందిని అరెస్ట్ చేశారు. కేరళ, తమిళనాడు, ఏపీ, కర్నాటక, తెలంగాణ, పుదుచ్చేరిలో ఈ ఆపరేషన్ కొనసాగింది. సైబర్ క్రైమ్ బ్యూరో 1,172 కేసుల్లో నిందితులను గుర్తించి పట్టుకుంది. అరెస్టైన ముఠా సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.






కామెంట్‌లు (0)