Magazines

ఆస్కార్‌ విజేత నటి ఇవా మేరీ సెయింట్‌ కన్నుమూత

1 గంట క్రితం

Oscar-winning actress Eva Marie Saint passes away
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హాలీవుడ్‌ ప్రముఖ నటి, ఆస్కార్‌ అవార్డు విజేత ఇవా మేరీ సెయింట్‌ (102) కన్నుమూశారు. లాస్‌ ఏంజెల్స్‌లోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1954లో వచ్చిన ‘ఆన్‌ ద వాటర్‌ఫ్రంట్‌’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె.. తొలి చిత్రంతోనే ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ అందుకున్నారు. అనంతరం ‘నార్త్‌ బై నార్త్‌వెస్ట్‌’, ‘ఎక్సోడస్‌’, ‘గ్రాండ్‌ ప్రీ’, ‘సూపర్‌మ్యాన్‌ రిటర్న్స్‌’ తదితర చిత్రాల్లో నటించారు. టెలివిజన్‌లోనూ రాణించిన ఆమె ‘పీపుల్‌ లైక్‌ అస్‌’ సిరీస్‌కు ఎమ్మీ అవార్డు అందుకున్నారు. 1924 జూలై 4న న్యూజెర్సీలో జన్మించిన ఇవా మేరీ సెయింట్‌.. సినిమా, టెలివిజన్‌, థియేటర్‌ రంగాల్లో ఏడు దశాబ్దాలకు పైగా కొనసాగారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్