నవతెలంగాణ - హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నెక్కొండ మండలం పిట్టకాలుబోడు తండాలో బుధవారం ఉదయం పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. గ్రామానికి చెందిన రమేశ్-అఖిల దంపతుల కుమారుడు రాహుల్ ఇంటి ముందు ఆడుకుంటూ రోడ్డుపై పడిన ఆటవస్తువును తీసుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో వచ్చిన ప్రైవేటు పాఠశాల బస్సు చిన్నారిని ఢీకొట్టింది. బస్సు ముందు, వెనుక టైర్లు చిన్నారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.





కామెంట్‌లు (0)