నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న లైంగిక దాడుల ఘటనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వారి మనసుల్లో తీవ్రమైన 'భయం' కలిగించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు సూచించింది. విద్యార్థినులను వేధించే 'అల్లరి మూకలు' తిరిగే కళాశాలలపై దృష్టి సారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత, ఢిల్లీ వ్యాప్తంగా అసాంఘిక శక్తులు గుమిగూడి మద్యం సేవించే వేలాది అక్రమ ఆహార విక్రయ కేంద్రాలపై దృష్టి పెట్టాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సోమవారం దక్షిణ ఢిల్లీలోని ఒక బాలికల కళాశాలకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్కులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు..సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ తరహా ఘటనలపై చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది.
లైంగిక దాడుల ఘటనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)