Magazines

విషాదం..కిడ్నాప్‌కి గురైన ఐదేళ్ల బాలిక అరులియా మృతి

5 గంటల క్రితం

child dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లోని బొల్లారం పీఎస్‌ పరిధిలో చిన్నారి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. కిడ్నాప్‌కి గురైన ఐదేళ్ల బాలిక అరులియాను సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ చంపినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. రెండు రోజులుగా విక్రమ్ అక్కడే సంచరించినట్లు గుర్తించారు. కాగా విల్లాలో పనిచేసే వాచ్‌మెన్ విక్రమ్ ఆ చిన్నారిని అపహరించి, పాపను క్షేమంగా వదిలిపెట్టాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్