మంత్రి సీతారామన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పలు దేశాలు టారిఫ్‌లు, ఇతర మార్గాలను ఆయుధంగా మార్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బుధవారం టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా కాన్‌క్లేవ్ 2025లో మంత్రి సీతారమన్ మాట్లాడుతూ..భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటే అదే మనల్ని కాపాడుతుందన్నారు. భారత్‌ను ఒకప్పుడు టారిఫ్ కింగ్ అన్నవారే వాటిని ఆయుధంగా మలుచుకుంటున్నారని ప్రత్యక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు. యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఆగస్టులో భారత్‌పై 50 శాతం సుంకాలను విధించగా.. ఇటీవల ఆదే బాటలో మెక్సికో కూడా 50 శాతం టారిఫ్‌లను వేసిన విషయం తెలిసిందే.



