Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంక్రీడా హబ్‌గా తెలంగాణ

క్రీడా హబ్‌గా తెలంగాణ

- Advertisement -

– మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీధర్‌బాబు
– కాన్హా శాంతి వనంలో బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం

నవతెలంగాణ-కొత్తూరు
క్రీడా హబ్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పరిధిలో గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ నిర్వహిస్తున్న 79వ యోనెక్స్‌ సన్‌రైజ్‌ ఇంటర్‌ స్టేట్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చాంపియన్‌షిప్‌ సౌత్‌ జోన్‌లో ఉన్న అగ్రశ్రేణి క్రీడాకారులందరినీ ఒకచోట కలిసేలా చేస్తుందని అన్నారు. గోపిచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉండటమే కాకుండా, క్రీడా స్ఫూర్తిని పెంచే సానుకూల, ప్రశాంతమైన వాతావరణం ఉందని తెలిపారు. ఈ స్థాయిలో క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇదే సరైన ప్రదేశమన్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గోపీచంద్‌ మాట్లాడుతూ.. గోపీచంద్‌ అకాడమీ క్రీడాకారులు అత్యుత్తమ బ్యాడ్మింటన్‌ చాంపియన్లుగా ఎదగడానికి సరైన శిక్షణ ఇస్తుందని తెలిపారు. ఈ చాంపియన్‌షిప్‌ వల్ల ఎంతోమంది క్రీడాకారుల్లోని నైపుణ్యం వెలుగులోకి వస్తుందని చెప్పారు. శ్రీ రామచంద్ర మిషన్‌ అధ్యక్షులు పూజ్య దాజి మాట్లాడుతూ.. 79వ ఇంటర్‌ స్టేట్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రీడల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటాం కాబట్టి.. వాటికి ఒక వృత్తిలా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ధ్యానంతో కలిసి సాధన చేస్తే శారీరక దృఢత్వంతో పాటు, జీవితంలోని పరిస్థితులను ఎదుర్కోవడంలో అపారమైన శక్తిని ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad